లగచర్ల ఒక ఉన్మాద రాజ్యం ప్రజల పై చేసిన వ్యూహాత్మక దాడి: జాదవ్ రమేష్ నాయక్

 *లగచర్ల ఒక  ఉన్మాద రాజ్యం ప్రజల పై చేసిన వ్యూహాత్మక దాడి: జాదవ్ రమేష్ నాయక్


*


*వెంటనే అమాయక గిరిజన రైతులను బేషరతు గా వదలాలి*


*ఇన్ని రోజులు జరిగిన పంట నష్టానికి పరిహారం ప్రభుత్వం అమాయక గిరిజనులకు ఇవ్వాలి*


 *అత్యుత్సాహం చూపించిన అధికార యంత్రాంగం మీద ఎస్సీ, ఎస్టీ కేసు లు నమోదు చేయాలి*


 *ఈ చిచ్చు కు బాధ్యులు అయిన పార్టీ నేతలను గుర్తించి కఠిన చర్య తీసుకోవాలి* 


*పబ్బం గడుపుకుంటున్న లంబాడీ కుల సంఘాల చెంచా ప్రతినిధులు: జాదవ్ రమేష్ నాయక్*


*లంబాడీల ఐక్య వేదిక డిమాండ్*


*సి కె న్యూస్ ప్రతినిధి*

తెలంగాణ రాష్ట్రం లో లగచర్ల అనే మంటలో గిరిజన రైతులు పడి కేసు ల పాలు అయి సంగారెడ్డి జైలు లలో మగ్గుతుంటే ఆ మంటలో కాంగ్రెస్ కుంపటి దగ్గర కొంత మంది లంబాడీ సంఘాల నాయకులు చలి మంట కాచుకుంటే BRS పార్టీ కుంపటి దగ్గర కొంత మంది లంబాడీ సంఘాల నాయకులు చలి మంట కాచుకుంటూ జాతికి ద్రోహం చేస్తున్నారని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ధ్వజం ఎత్తారు.


జాతి మీద చిత్త శుద్ధి ఉంటే పార్టీ లకు ప్రభుత్వానికి సింహ స్వప్నం లాగ మారాల్సిన ప్రతి పక్షం పాత్ర పోషించాల్సిన కొన్ని లంబాడీల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మరియు BRS  పార్టీ చెంచా లంబాడీ నేతల కు బానిసత్వం చేస్తూ కాన్షిరాం చెప్పిన చెంచా లకే  చెంచాలుగా తయారు అయ్యారు అని దుయ్యబట్టారు.


ఈ సందర్భముగా కన్షిరాం చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశం లో ఉన్న బహుజన కుల సంఘాలు ఒక చేతి తో అడుక్కొని పబ్బము గడుపుకుంటే తెలంగాణ రాష్ట్రం లో ఉన్న కుల సంఘాలు రెండు చేతులతో ఆడుక్కొని పబ్బము గడుపుకుంటున్నాయి అన్న మాటలను నిజం చేస్తూ లంబాడీ కుల సంఘాల నాయకులు తీరు ఉంది అని ఎద్దేవా చేసారు. 


కొడంగల్ లంబాడీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది మార్పు కావాలి అని BJP TRS CONGRESS లలో ఏ పార్టీ నీ వదలకుండా అన్ని పార్టీ లు తిరిగిన ఒక వ్యక్తిత్వం లేని నాయకుడిని గెలిపిస్తే ఆయనే మరల మా లంబాడీలకు  హరి గోస పెట్టడాన్ని లంబాడీల ఐక్య వేదిక ద్వారా ఖండిస్తున్నాము అని తెలియ చేసారు.


కొడంగల్ లో మీ పరిశ్రమకు కావాల్సిన భూమి నీ అంత పెద్ద ఆసామి ఎవరు అంటే వారి భూమి లాక్కోవాలని, లేకుంటే మీ  ఊరిలో ఆ పరిశ్రమ పెట్టుకోవాలి అని సూచించారు, ఈ రాష్ట్రం లో ఎవరు అయిన వ్యవసాయం మీద ఆధార పడి ఉన్నారు అంటే అది కేవలం లంబాడీ జాతి కాబట్టి అటువంటి వాటి వారిని ప్రోత్సహించి వ్యవసాయాన్ని మెరుగు పరుచుకోవాలని సూచించారు.


రాష్ట్రం మొత్తం మీద దున్నలేని వారి భూమి నీ లంబాడీ రైతులు దున్నుకుంటారు అని అలా తక్కువ భూములు ఉన్న ఆ రైతులకు భూమి నీ సూచించి ప్రభుత్వమే కౌలు కు తీసుకొని లంబాడీ రైతులకు ఇవ్వాలి అని సూచించారు.

Comments