*ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి*
*తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ వద్ద సంఘటన*
*మరో ఇద్దరికి గాయాలు*
సి కే న్యూస్ షాద్ నగర్ :నవంబర్ 30
ట్రాక్టర్ బోల్తా పడి ఓ వలస కూలి,ఓ చిన్నారి మృతి చెందారు.మరో ఇద్దరు కూలీలు గాయపడ్డారు.ఈ సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ వద్ద జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిపాలెంలో పత్తి తీసేందుకు కర్నూలు నుంచి వరస కూలీలు శనివారం రాత్రి ట్రైన్ లో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కు వచ్చారు.'వారిని రెడ్డిపాలెంకి చెందిన ఓ ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకెళ్తుంది.
ఈ నేపథ్యంలో తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ వద్దకు వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కూలి, చిన్నారి మమత అక్కడికక్కడే మృతి.
మరో ఇద్దరు కూలీలు ఉరవకొండమ్మ,వెంకటేశ్వరమ్మ కు గాయాలయ్యాయి.వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Post a Comment