వైద్య పరికరాల జాతీయ విధానం(ఎన్ ఎండీపీ) అమలుకు కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటీ?

 *వైద్య పరికరాల జాతీయ విధానం(ఎన్ ఎండీపీ) అమలుకు  కేంద్రం ఏం చర్యలు తీసుకుంది..?*



* దిగుమతుల తగ్గింపునకు  ఏదైనా కార్యాచరణ రూపొందించబడిందా..?

* ప్రత్యేక లక్ష్యసాధనకు ఆర్థిక  కేటాయింపుల వివరాలేంటి..?

* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి 


*ఖమ్మం:* నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ (NMDP-2023) అమలు కోసం దేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. సభలో ఆయన మాట్లాడుతూ..  దిగుమతులపై ఆధారపడటాన్ని 70 శాతానికి తగ్గించడానికి  ఏదైనా ప్రణాళిక రూపొందించబడిందా..? అని..అడిగారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖిత పూర్వక  సమాధానమిచ్చారు. వైద్య పరికరాల జాతీయ విధాన అమలుకు చర్యలు తీసుకుంటున్నామని.. మంత్రిత్వ శాఖతోపాటు, ఫార్మాస్యూటికల్స్ విభాగంతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. నిర్దిష్ట వ్యూహాల అమలుకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దిగుమతులను తగ్గించేందుకు.. దేశీయంగా వైద్య పరికరాల తయారీని కేంద్రం ప్రోత్సహిస్తోoదని తెలిపారు.

*వైద్య పరికరాల దేశీయ తయారీ ప్రోత్సాహం ఇలా..*

 ప్రత్యేక లక్ష్యసాధనకు ఆర్థిక కేటాయింపుల గురించి.. ఎంపీ రఘురాo రెడ్డి ప్రశ్నించడంతో.. కేంద్రమంత్రి వివరాలు ఇలా తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్  ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్  ప్రమోటింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడికల్ డివైసెస్ (PLI MD) పథకం ద్వారా 

 దేశీయంగా తయారీని ప్రోత్సహించడం,  వైద్య పరికరాల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. 

 ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం 20.03.2020న ప్రతిపాదనను ఆమోదించిందని, 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం వ్యయం రూ. 3,420కోట్లుగా నిర్ణయించినట్లు ప్రకటించారు.

*ఆయా కంపెనీలకు ప్రోత్సాహకాలు..*

ఎంపిక చేసిన కంపెనీల నుంచి పెరుగుతున్న వైద్య పరికరాల అమ్మకాలపై 5 శాతం చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లువివరించారు.ఈ పథకానికి 32 మంది దరఖాస్తుదారులు ఎంపికయ్యారని, సంబంధిత అమ్మకాలు సెప్టెంబర్ 2024 వరకు రూ. 8039.63 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

*వైద్య పరికరాల పార్కుల ప్రమోషన్ కోసం పథకం* వైద్య పరికరాల యూనిట్లకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు దక్కేలా..

2020 మార్చి 20న "మెడికల్ డివైస్ పార్కుల ప్రమోషన్" పథకం ఆమోదించబడిందని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్.. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కి తన జవాబు ద్వారా వివరించారు. రూ. 400 కోట్లతో 2025 వరకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.  ఈ పథకానికి 16 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా.... ఇందులో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని వైద్య పరికరాల పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని అన్నారు. తయారీ వ్యయం తగ్గించడానికి.. అలాగే పర్యావరణహితానికి  కేంద్రo చర్యలు తీసుకుంటుందని వివరించారు.

Comments