మావోయిస్టులకు ఆదివాసుల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

 *మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు* 

*మావోయిస్టులకు ఆదివాసుల ప్రాణాలు అంటే లెక్క లేదా..?* 


 *సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్* 


 ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన   కరపత్రాల కలకలం రేపుతుంది. ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను ఇన్ఫార్మర్ నెపంతో గొడ్డలితో నరికి చంపిన


మావోయిస్టులకు వ్యతిరేకంగా  ఆదివాసి ఐక్యవేదిక ములుగు జిల్లా పేరిట  కరపత్రాలు వాజేడు మండలం చెరుకూరు, ధర్మవరం గ్రామాలలో రోడ్లపై వెలిశాయి.


 మావోయిస్టులకు ఆదివాసీల ప్రాణాలు అంటే లెక్క లేదా  అమాయక ఆదివాసీలను భయపెట్టి  సరుకులు సామాగ్రి వారితో తెప్పించుకుంటూ  తిరిగి ఆదివాసి ప్రాణాలను  ఇస్తున్నారని కరపత్రాలలో పేర్కొన్నారు. 



 అమాయక గిరిజనుల ను బలి  తీసుకోవడమేనా మీ ఉద్యమం గిరిజన బిడ్డలారా ఇలాంటి బెదిరింపులకు భయపడవద్దు మావోయిస్టులకు సహకరించవద్దు ఆదివాసి బిడ్డలందరం కలిసికట్టుగా ఉంటూ మావోయి కుట్రలను  తిప్పి కొడదాం అని కరపత్రాలలో పొందుపరిచారు.

Comments