*మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరుదైన శస్త్ర చికిత్స*
*తక్కువ ఖర్చుతో ఆధునీక వైద్యం*
*మమత వైద్య సంస్థల సెక్రటరీ జయశ్రీ, న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్*
*సి కె న్యూస్ ప్రతినిధి*
మమత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అరుదైన శస్త్రచికిత్సలతో పాటు, తక్కువ ఖర్చుతో అధునీక వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు మమత వైద్య విద్యా సంస్థల సెక్రటరీ పువ్వాడ జయశ్రీ తెలిపారు. మంగళవారం మమత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి మమత ఆసుపత్రిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది రోగులు వైద్యం కోసం మమత ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఎన్నో క్లిష్టతరమైన రోగాలకు కూడా మమత ఆసుపత్రిలో చికిత్సలు అందించినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలలో వైద్య సేవలు పొంది చివరి దశలో మమత ఆసుపత్రిలో చేరిన వారికి కూడా వైద్య సేవలను అందించి వారి జబ్బును నయం చేసి క్షేమంగా ఇంటికి పంపించిన ఘనత మమత ఆసుపత్రిది అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునీక సౌకర్యాలతో అన్ని విభాగాలలో వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నట్లు తెలిపాడు. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మమత ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో మమత ఆసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మమతలో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు..
*న్యూరో విభాగంలో అరుదైన శస్త్ర చికిత్స: డాక్టర్ జగదీష్*
న్యూరో విభాగంలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐదు లక్షలకు పైబడి ఖర్చయ్యే శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీలో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 80 సంవత్సరాల జి, వెంకయ్య అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా తలనొప్పి, కళ్లు తిరగుడు, నడుస్తూ తుళ్లిపడటం, ఏ పని చేయకపోవడం, అప్పుడప్పుడు వాంతులు , నరాల బలహీనత, కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతూ నవంబర్ ఒకటిన మమత ఆసుపత్రికి వచ్చాడని ఆయన తెలిపారు.
వెంకయ్యకు ఎం ఆర్ ఐ, సిటీ స్కాన్ ఇతర పరీక్షలు నిర్వహించి అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ట్యూమర్ కూడా మెదడు నుంచి వెన్నుపూసకు వచ్చే భాగంలో చిన్న మెదడు మేడకు మధ్యలో ఆ ట్యూమర్ ఏర్పడిందని డాక్టర్ జగదీష్ తెలిపారు. ఈ నెల 15న అతనికి శస్త్ర చికిత్స నిర్వహించామని ఈ శస్త్రచికిత్స కూడా ఎంతో క్లిష్టతరమైందని తెలిపారు. తల వెనక బాగం కండరాల మధ్య నుంచి ఈ శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. అటువంటి శస్త్ర చికిత్సను మమతలో విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోగి వెంకయ్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని డిశ్చార్జి చేయనున్నట్లు ఆయన తెలిపారు. న్యూరో విభాగంలో అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు మమత ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మమత ఆసుపత్రి యజమాన్యం సహకారంతో అత్యాధునిక వైద్య సేవలు మమతలో అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామి మాట్లాడుతూ మమత ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునీక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సాధారణ శస్త్ర చికిత్సలతో పాటు ల్యాప్రోస్కోపిక్, లేజర్ శస్త్ర చికిత్సలు కూడా మమతలో అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనురాధ, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment