రైతును రాజు చేసే లక్ష్యమే... కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి - తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో రైతుల పండుగ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కొత్తూరు రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రుల చిత్రపటాలకు ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, రైతులు పూలాబీషేకం చేశారు.
అనంతరం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రసారమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల పండుగ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ... ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్క సంవత్సరంలోనే 55 వేల కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చుపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రైతులు ను పట్టించుకోవటం చేతగాని బిజెపి, బీఆర్ఎస్ ప్రభుత్వాలుకు ఎన్నికలు వచ్చాయంటే రైతులు గుర్తుకొస్తారు అన్నారు. పట్టుమని లక్ష రూపాయలు రుణమాఫీ చేయటం చేతగాని బిఆర్ఎస్ వాళ్లకు... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు.
అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ...కాంగ్రెస్ అంటేనే పెద ప్రజల, రైతుల పక్షపాతి అని, ప్రకటించిన సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా... ప్రజావసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి,కౌన్సిలర్లు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు..
Comments
Post a Comment