*రాయపూడి జైకర్ మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం*
*సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం*
ఖమ్మం కార్పొరేషన్ శ్రీనివాసనగర్ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాయపూడి జైకర్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు ఆయన మృతి పట్ల ఒక ప్రకటనలో మాజీ ఎంపీ నామ సంతాపం తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పని చేస్తూ, ఖమ్మం టౌన్ పార్టీ కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్న ఆయన, స్ఫూర్తిదాయక నాయకుడిగా గుర్తింపు పొందారని నామ అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి జైకర్ క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా తుది శ్వాస వరకు కొనసాగారన్నారు. జైకర్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Comments
Post a Comment