*అమెరికా నుంచి ఖమ్మం జిల్లా విద్యార్థి మృతదేహాన్ని తెప్పించేందుకు ఎంపీ విశేష కృషి..*
* ఇప్పటికే..ముఖ్యమంత్రికి లేఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో వాకబు చేసిన లోక్ సభ సభ్యులు రఘురాం రెడ్డి
* అమెరికా చికాగోలోని కాన్సులేట్ కార్యాలయం ద్వారా..వేగిరo
* ఎన్ఆర్ఐ, తానా విభాగాలతో సంప్రదింపులు
సికె న్యూస్ ప్రతినిధి
*ఖమ్మం:* అమెరికాలో తుపాకీ తూటాలకు ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడైన నూకారపు సాయి తేజ.. అనే ఎంఎస్ విద్యార్థి దుర్మరణం చెందగా.. అతడి మృతదేహాన్ని మన దేశానికి త్వరగా రప్పించేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి విశేష కృషి చేస్తున్నారు.
భారత కాలమానo ప్రకారం శనివారం తెల్లవారుజామున దుoడగుల కాల్పుల్లో మృతి చెందిన దుర్ఘటన తెలుసుకొని.. ఎంపీ సత్వరమే స్పందించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ సూచనతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ( ఇండియన్ హై కమిషన్ ) అధికారులతో సంప్రదించారు.
వీలైనంత త్వరగా.. సాయి తేజ మృతదేహాన్ని భారత్ కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఎన్ఆర్ఐ విభాగం ద్వారా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం( తానా) ద్వారా కూడా.. ఎంపీ రఘురాం రెడ్డి అమెరికాలో వేగంగా చర్యలు తీసుకునేలా చూస్తున్నారు.
శనివారం, ఆదివారం అమెరికాలో వారాంతపు సెలవులు ఉన్నప్పటికీ.. మానవీయ కోణంలో.. జాప్యం లేకుండా వీలైనంత త్వరగా సాయి తేజ మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేలా.. రెండు రోజులుగా కృషి చేస్తున్నారు.
మృతుడి తండ్రి.. నూకారపు కోటేశ్వరరావు తో.. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ద్వారా ఇప్పటికే ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎంపీ రఘురాం రెడ్డి అభయమిచ్చారు.
Comments
Post a Comment