రైతు పండుగ విజయవంతం పట్ల మంత్రి తుమ్మల కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు

రైతు పండుగ విజయవంతం పట్ల మంత్రి తుమ్మల కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు.

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్

తుమ్మల నివాసానికి వెళ్లి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ స్టాల్స్ ఏర్పాటు తో పాటు రైతాంగం కు ఆదునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని, 


బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని ,రేవంత్ పాలనలో రైతు రాజ్యం గా మారిందని ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి గా తుమ్మల లాంటి రైతు బిడ్డ ఆదర్శ రైతు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని 

మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తన నివాసానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి తుమ్మల శాలువా కప్పి స్వాగతం పలికారు.ఇరువురు నేతలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

Comments