ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య..
మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత రోజే ఘటన
ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ సూసైడ్ చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యక్తిగత కారణాలతో సూసైడ్ కి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఆయన ఈ సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఏటూరు నాగారం మండలం చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య పోరులో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా..
రెండు ఏకే 47 తుఫాకులతో పాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు హస్తగతం చేసుకున్నారు. కాగా, మరణించిన ఏడుగురు మృతదేహాలకు ఈరోజు పోస్ట్ మార్టం చేయనున్నారు.
Comments
Post a Comment