సచివాలయంలో అగ్ని ప్రమాదం

 *సచివాలయంలో అగ్ని ప్రమాదం


?*



అమరావతి: ఏప్రిల్ 04

ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో శుక్రవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. 


ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమా చారం ఇచ్చారు. వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మం టలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చా రు.ప్రమాదవశాత్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.


సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారా యణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. 


తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాల యం లోపల లేరని సమా చారం. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా? మరి ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments