హిళలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఆర్‌ఎంపి...
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రాయగడ రోడ్డులో ఒక భవనం పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న ఆర్‌ఎంపి వైద్యుడు..
మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడంతో గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. బెంగాల్‌కు చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు బి సర్కారు గత ఆరు నెలలుగా రాయగడ రోడ్డులోని ఉన్న డాక్టర్ వసంత్‌కుమార్ డాక్టర్ హాస్పిటల్ మేడపై రూమ్ అద్దెకు తీసుకొని భవాని పైల్స్ క్లినిక్ పేరిట ఆస్పత్రి నడుపుతున్నాడు. ఆపరేషన్ లేకుండా మూలవ్యాధి తగ్గిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. గురువారం ఉదయం ఆ భవనం దిగువన ఉన్న చిన దేవర వీధిలో బాత్ రూమ్‌ల్లో స్నానం చేస్తున్న మహిళలను సెల్‌ఫోన్‌తో మేడపై నుంచి సర్కారు వీడియో తీశారు.
ఇది గమనించి మహిళలు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు అతడి వద్దకు వెళ్లి దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సర్కారును పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ మురళీధర్ ఆదేశాలతో పట్టణ ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేపస్తున్నారు. సర్కారు గతం నుంచి ఇలా వీడియోలు తీస్తున్నారని మహిళలు ఆరోపించారు.
Comments
Post a Comment