అర్ధరాత్రి రైల్ లో కత్తులతో దోపిడీ దొంగల హల్‌చల్....

అర్ధరాత్రి రైల్ లో కత్తులతో దోపిడీ దొంగల హల్‌చల్....


దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన భయానక ఘటన గురువారం అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ కు బయలుదేరింది. ఈ క్రమంలోనే ట్రైన్ క్రాసింగ్ కోసం కర్నూలు జిల్లా బోగోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది.



 ఇదే అదనుగా భావించిన ఇద్దరు దోపిడీ దొంగలు చేతిలో కత్తులు పట్టుకుని ఎస్-2 (S2) బోగిలోకి ప్రవేశించారు.


అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన ఇతర ప్రయాణికులపై కూడా వారు దాడి చేసేందుకు యత్నించారు. 


ఈ మేరకు బాధితులు కర్నూలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Comments