రైలులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..
రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు.
అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్‌కు వెళ్లిన బాలికను ఫోన్‌లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఒడిశాకు చెందిన బాలిక తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణిస్తూ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు మహారాష్ట్రలోని కెల్జార్‌కు చేరుకునే సమయానికి వాష్‌రూమ్‌కు వెళ్లింది.
రైలులో ప్రయాణిస్తున్న బాలిక మిడ్‌నైట్ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లింది. వెనకాలే ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు.
అరగంట పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, ఆ చర్యను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) ఫిర్యాదు చేశారు, వారు కేసు నమోదు చేసి, అధికార పరిధిలో స్థానిక పోలీసులకు బదిలీ చేస్తామని చెప్పారు.
బాలికను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు . నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Post a Comment