మేం రిపోర్టర్లం.. మమ్మల్నే టోల్ అడుగుతావా .. టోల్ సిబ్బందిపై దుండగుల దాడి
టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై దుండగులు దాడికి తెగబడ్డారు. 'మేం మీడియా వాళ్లం.. మమ్మల్నే డబ్బులు అడుగుతావా' అంటూ బండ బూతులు తిట్టారు. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. శంషాబాద్పరిధిలోనితొండుపల్లి ఔటర్ ఎగ్జిట్ వద్ద సంజయ్ దత్ టోల్ వసూల్సిబ్బందిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కారు(టీఎస్ 08ఈఎన్ 0027)లో దర్జాగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు టోల్చెల్లించకపోవడంతో వారిని ఫీజు చెల్లించాలని సంజయ్ దత్ కోరాడు. దీంతో 'మేం మీడియా వాళ్లం.. మమ్మల్నే డబ్బులు అడుగుతావా' అంటూ కారులో నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి టోల్ బూతులోకి చొరబడి హంగామా సృష్టించాడు.
బండ బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా టోల్ ఫీజు అడిగిన సంజయ్ దత్ కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చాడు. ఇంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డ యువకుడికి మద్దతుగా టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన వారిపై సైతం దాడికి యత్నించి, పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా, బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు సమాచారం.

Comments
Post a Comment