*ఫ్లాష్ ఫ్లాష్..*
*షాద్ నగర్ లో ఆర్ఎంపీల పరుగో పరుగు..!*
*ఎమ్మెల్యే గారు కాపాడండి..*
*ఎమ్మెల్యే శంకర్ వద్దకు పరుగులు తీసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు*
*పత్రికల్లో మాపై వార్తలు రాస్తున్నారంటూ మొరపెట్టుకున్న ఆర్ఎంపీలు*
*కాపాడండి మహాప్రభో అంటూ దీర్ఘాలు తీసిన ఆర్ఎంపీలు*
*ఆర్ఎంపీల తీరుపై ఎమ్మెల్యే శంకర్ గుస్సా ..*
*ఎవరి పరిధిలో వారు వైద్యం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన..*
*వారం రోజులపాటు నిరంతరం దాడులు జరుగుతాయా.. అధికారులు తోక ముడుస్తారా...?*
కాపాడండి మహాప్రభు అంటూ షాద్ నగర్ పట్టణంలో ఆర్ఎంపి పిఎంపి వైద్యులు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వద్దకు పరుగులు తీశారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి సారాద్యంలో పట్టణంలో అనేక ప్రైవేట్ క్లినిక్ లపై దాడులు నిర్వహించారు. 4 క్లినిక్లను సైతం సిజ్ చేశారు.
పరిధికి మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో నిత్యం చెలగాటం ఆడుతున్న వైనంపై ఇటీవలే మీడియాలో వరుస కథనాలు ప్రచురితం అవుతున్నాయి. దీనిపై కన్నీరుగా చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులకు దిగారు.
పట్టణంలోని కీర్తి పాలి క్లినిక్, మనశ్విని, ఇంకా మరో రెండు క్లినిక్ లను సీజ్ చేయడం జరిగింది. అయితే వారం రోజులపాటు ఈ దాడులు నిరంతరంగా జరుగుతాయని జిల్లా అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించడంతో గత్యంతరం లేక ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వద్దకు పరుగులు తీశారు.
కాపాడండి మహాప్రభు అంటూ వేడుకున్నారు. పత్రికల్లో తమపై వార్తలు రాస్తున్నారని దీని ఫలితంగా దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ముందు వాపోయారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సదర్ వైద్యులకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. పరిధి దాటి వైద్యం చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించి అధికారుల సూచన సలహాలతో ప్రాథమిక వైద్యం చేయాలని ఆసుపత్రులను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సబబు కాదని ఎమ్మెల్యే శంకర్ హితవు పలికారు. అంతేకాదు జరుగుతున్న ఘటనల్లో అమాయక ప్రజలు చికిత్స పేరుతో వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారని ఇవి సమంజసనీయం కాదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ప్రభుత్వ అధికారులు ఎవరి పనులు వారు చేసుకుంటారని ఇందులో తమ ప్రమేయం ఏముంటుందని వారికి నచ్చజె చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని పరిధి దాటి వైద్యం చేయకూడదని పేర్కొన్నారు. ఇక
*మీడియాలో రాస్తే నేనేం చేయను..*
మీడియా ప్రతినిధులు వాస్తవాలు ప్రతిబింబిస్తారని, వాళ్లు వాస్తవాలు రాస్తే నేనేం చేయగలను వారిని నేను నివారించలేను అంటూ ఎమ్మెల్యే శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు బాధితులు ఎమ్మెల్యే ముందు మీడియా పై ఫిర్యాదులు చేయడానికి ప్రయత్నించారు.
అయితే ఎమ్మెల్యే వెంటనే వారికి సమాధానం చెబుతూ మీడియాలో వాస్తవాలే వస్తాయని దానికి తాను ఏం చేయలేనని స్పష్టం చేశారు. మీరే మారే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే కరాకండిగా చెప్పారు. పరిధి దాటి వైద్యం చేస్తే ఎవరైనా రాస్తారని వారికి తాను ఏం చెప్పబోనని అన్నారు.
*ఎమ్మెల్యేను కలుసుకున్న జిల్లా వైద్య శాఖ అధికారి*
శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎమ్మెల్యేను కలుసుకున్నారు.
పట్టణంలో నాలుగు అనుమతి లేని ఆసుపత్రులను సీజ్ చేసిన తరుణంలో ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులు ఎమ్మెల్యే శంకర్ ను ఆశ్రయించగా అదే సమయంలో డిమాండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితర బృందం ఎమ్మెల్యేను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన విషయాలను వారి ద్వారా ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ప్రైవేట్ క్లినిక్ లలో ఇలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండా వారి పేర్లతో ఆసుపత్రులు చలామణిలో ఉన్నాయని అలాంటి వాటిపై కొరడా జలపిస్తున్నట్లు తెలిపారు.
*ఇప్పుడేం జరగబోతుంది..?*
ఎమ్మెల్యే శంకర్ ముందరే ఓవైపు ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు మొరపెట్టుకుంటుండగా అక్కడికి చేరుకున్న ఆరోగ్యశాఖ అధికారులు అందరూ అక్కడే పోగయ్యారు.
దీంతో అధికారులు వారం రోజులపాటు పట్టణంలో నిజాయితీగా దాడులు జరుపుతారా లేక తోక ముడుస్తారా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ అంశం రాజకీయంగా ఇప్పుడు మారబోతుంది. ప్రైవేట్ వైద్యులు కొందరు కూడా ఎమ్మెల్యేలు కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
గల్లీ గల్లీలో విచ్చలవిడిగా వెళుతున్న అనుమతి లేని దవాఖానాలతో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు చెడ్డ పేరు వస్తుంది. ఈ నేపథ్యంలో క్వాలిఫై డాక్టర్లు కూడా ఇటీవల ఫిర్యాదులు చేశారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. క్వాలిఫైడ్ డాక్టర్లు కాకుండా అన్ క్వాలిఫైడ్ వాళ్లు కూడా వైద్యం చేస్తూ వైద్య రంగాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని వారు అంటున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్పారు అధికారులు ఏం చేస్తారు ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయా లేక చల్తేకినం గాడియా తెలియాల్సి ఉంది..!
Comments
Post a Comment