భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి




సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),


ఏప్రిల్ 06,



తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో సారపాక లోని బిపిఎల్ హెలిపాడ్ లో 11 గంటలకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం మంత్రివర్యులు వ్యవసాయ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు.11:05 నిమిషాలకు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపానికి బయలుదేరారు.

Comments