సరోజినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిపై సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు...

శ్రీ సరోజినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిపై సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు.....

డాక్టర్ భర్త కుమార్ రెడ్డి నా భర్తను కాపాడాడు: విద్యాసాగర్ భార్య ప్రశాంతి....

పెబ్బేరు మున్సిపాలిటీ...

కొత్తకోటకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి ఇటీవల నరాల వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కొత్తకోట కు చెందిన *సరోజిని హాస్పిటల్* కి విద్యాసాగర్ తన భార్య తో హాస్పటల్ కు వెళ్లగా... డాక్టర్ బాలకృష్ణ తో ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్లగా, 2,3 రోజులు గడిచిన తర్వాత కూడ ఆ వ్యాధి లో ఎలాంటి మార్పు రాలేదు. 

కానీ విద్యాసాగర్ తొడ పై వాపులు రావడంతో మళ్ళీ హాస్పటల్ కీ వెళ్లగా, ఐస్ ముక్కలతో ట్రీట్మెంట్ చేసి పంపించారని విద్యాసాగర్ భార్య ప్రశాంతి తెలుపడం జరిగింది. 



మరుసటి రోజున ఇరుగుపొరుగు వారి సూచనమేరకు మహబూబ్ నగర్ తీసుకెళ్లండి అని చెప్పడంతో, వెళ్ళిరావడం జరిగింది. అయినా విద్యాసాగర్ కు ఉన్న వ్యాధిలో ఎలాంటి మార్పు రాలేదు. 

మళ్ళీ మరుసటి రోజున పెబ్బేరు లోని సరోజినీ హాస్పటల్  డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ మొదలుపెట్టి చేసి నా భర్త ను కాపాడాడు. 

కానీ  గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో శ్రీ సరోజినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియా లో వచ్చేది అంత  అవాస్తవమే, వాస్తవం కాదు.  

ఆపరేషన్ థియేటర్ లో ఫోటో లు దింపి సోషల్ మీడియా లో పెడుతూ  తప్పుదొవా పట్టిస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారాని  విద్యాసాగర్ భార్య ప్రశాంతి CK న్యూస్ కు తెలియజేయడం జరిగింది.

Comments